Income Tax: వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. ప్రకటించిన నిర్మలా సీతారామన్
ఈ వార్తాకథనం ఏంటి
2025-26 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా ఆదాయ పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు చేపట్టింది.
త్వరలోనే కొత్త ఆదాయ పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ఆమె తెలిపారు.
"ముందుగా విశ్వాసం - తరువాత పరిశీలన" అనే సూత్రాన్ని అమలు చేయడానికి వచ్చే వారం కొత్త ఆదాయ పన్ను బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నామని తెలిపారు.
ఈ బిల్లు కారణంగా ఆదాయ పన్ను విధానం మరింత సులభతరం కానుంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయ పన్ను నిబంధనల సంఖ్యను సగానికి తగ్గించడంతో పాటు, టీడీఎస్, టీసీఎస్ వ్యవస్థలను క్రమబద్ధీకరించనున్నామని" ఆమె బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.
వివరాలు
వృద్ధులకు టీడీఎస్ లో ఉపశమనం
వృద్ధ పౌరులకు ఊరట కల్పిస్తూ, "సీనియర్ సిటిజన్ల వడ్డీ ఆదాయంపై టీడీఎస్ పరిమితిని రూ.50,000 నుండి రూ.1 లక్షకు పెంచుతున్నాం. అదేవిధంగా, అద్దె ద్వారా లభించే ఆదాయంపై టీడీఎస్ పరిమితిని రూ.2.4 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంచుతున్నాం" అని నిర్మలా సీతారామన్ వివరించారు.
అంతేకాకుండా, ఇంకం ట్యాక్స్ రిటర్న్ సమర్పణ గడువును పొడిగించారు.
ఏదైనా మదింపు సంవత్సరానికి అప్‌డేటెడ్ రిటర్న్ సమర్పించేందుకు ప్రస్తుతం ఉన్న 2 ఏళ్ల పరిమితిని 4 సంవత్సరాలకు పెంచుతున్నట్లు తెలిపారు.
అలాగే, ఉన్నత విద్య కోసం తీసుకునే రుణాలపై టీసీఎస్ నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.