LOADING...
Amaravati: అమరావతిలో మూడేళ్ల తర్వాత నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్.. రూ.40వేల కోట్లకు ఆమోదం
అమరావతిలో మూడేళ్ల తర్వాత నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్.. రూ.40వేల కోట్లకు ఆమోదం

Amaravati: అమరావతిలో మూడేళ్ల తర్వాత నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్.. రూ.40వేల కోట్లకు ఆమోదం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 11, 2025
05:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

సీఆర్‌డీఏ దాదాపు 70 నిర్మాణ పనులకు సంబంధించి రూ.40వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్‌డీఏ 45వ అథారిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంట్రాక్టు ఏజెన్సీలకు అంగీకార పత్రాలు (లెటర్ ఆఫ్ అగ్రిమెంట్) ఇవ్వాలని నిర్ణయించారు. ఒప్పంద ప్రక్రియ పూర్తయిన తర్వాత రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ కీలక సమావేశానికి మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్‌, సీఎస్ విజయానంద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.