
New Ration Cards : ఏపీలో కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. మళ్లీ అప్లై చేయనవసరం లేదు!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అభివృద్ధి మార్గంలో ధృడంగా అడుగులు వేస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వేగంగా ముందుకెళ్తున్నారు.
ఈ పరిణామంలో రాష్ట్ర ప్రజలు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న కీలక అంశాల్లో కొత్త రేషన్ కార్డుల జారీ ఒకటి.
ఈ విషయంలో తాజా సమాచారం ప్రకారం, గత వైసీపీ హయాంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసినవారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
అప్పట్లో వచ్చిన సుమారు 3.36 లక్షల అప్లికేషన్లు ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో ఉంచిందని వెల్లడించారు.
Details
డిజిటల్ దరఖాస్తు ప్రక్రియ
ఇకపోతే, వచ్చే మే 15వ తేదీ నుంచి 'మనమిత్ర' అనే వాట్సాప్ సేవ ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులూ వెల్లడించారు.
దీనిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవలే ప్రకటన చేశారు. ప్రజలకు మరింత సులభతరంగా సేవలు అందించాలన్న ఉద్దేశంతోనే ఈ డిజిటల్ దరఖాస్తు ప్రక్రియ తీసుకురావడం జరిగిందని చెబుతున్నారు.
అంతేకాకుండా జూన్ నెలలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి తుది చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఈ చర్యల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ లబ్ధి నేరుగా, తక్కువ అవాంతరాలతో అందే అవకాశం ఉందని అంచనా.
ఇది ప్రజల ఆర్థిక భద్రతను గణనీయంగా మెరుగుపరిచే కీలక ముందడుగు అన్నది స్పష్టంగా కనిపిస్తోంది.