Grenade Attack: అమృత్‌సర్‌లో గుడిపై గ్రేనేడ్ దాడి.. భయాందోళనలో భక్తులు
ఈ వార్తాకథనం ఏంటి
అమృత్‌సర్‌లోని ఓ ఆలయంపై గ్రేనేడ్ దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. శుక్రవారం అర్థరాత్రి ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి హ్యాండ్ గ్రేనేడ్ విసిరినట్లు తెలిసింది.
ఈ దాడి గురించి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు నిర్ధారించారు. పేలుడు కారణంగా ఆలయ గోడ స్వల్పంగా దెబ్బతిన్నా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఆలయ పూజారి, అతని కుటుంబం పైభాగంలో నివాసం ఉంటున్నా, వారికి ఎటువంటి హాని కలగలేదు. ఈ ఘటనపై సీనియర్ పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.
అమృత్‌సర్‌లో మతపరమైన ప్రదేశంపై దాడి జరగడం ఇదే తొలిసారి అని పోలీసులు భావిస్తున్నారు.
Details
దాడిని ఖండించిన కిరణ్‌ప్రీత్ సింగ్
గతంలో అక్కడ ఎక్కువగా పోలీసు స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగేవి.
కాగా గడిచిన నాలుగు నెలల వ్యవధిలో గ్రేనేడ్ దాడులు జరగడం ఇది 12వ సారి కావడం గమనార్హం.
ఈ దాడిని స్థానిక నేత కిరణ్‌ప్రీత్ సింగ్ తీవ్రంగా ఖండించారు. పంజాబ్‌లో నెలకొన్న శాంతి, సౌహార్దానికి విఘాతం కలిగించే కుట్ర జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.