Page Loader
గ్రేహౌండ్స్‌ గురువు బాటీ కన్నుమూత.. సీఎం కేసీఆర్, డీజీపీ అంజనీకుమార్‌ సంతాపం
గ్రేహౌండ్స్‌ గురువు బాటీ కన్నుమూత.. సీఎం కేసీఆర్, డీజీపీ అంజనీకుమార్‌ సంతాపం

గ్రేహౌండ్స్‌ గురువు బాటీ కన్నుమూత.. సీఎం కేసీఆర్, డీజీపీ అంజనీకుమార్‌ సంతాపం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 14, 2023
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌కు చెందిన మాజీ సీనియర్ ఐపీఎస్ అధికారి భాటీ మంగళవారం మరణించారు. ఉమ్మడి ఏపీలోని పోలీసులకు నారాయణ్‌ సింగ్‌ బాటీ అంటే దాదాపుగా తెలియనివారు ఉండకపోవచ్చు. వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోనేందుకు గ్రేహౌండ్స్‌ విభాగాన్ని పటిష్ఠంగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదే. అటవీ యుద్ధంలో అత్యంత సమర్థవంతంగా పనిచేసే కమాండోల విభాగంగా తీర్చిదిద్దిన గొప్పతనాన్ని బాటీ సొంతం చేసుకున్నారు. ఈ మేరకు ఆయన సేవలకు గానూ భారత ప్రభుత్వం పద్మశ్రీ అందించి గౌరవించింది. ఒక దశలో అమెరికా భద్రతా దళాలు సైతం ఇక్కడే శిక్షణ తీసుకున్నాయంటే గ్రేహౌండ్స్‌ పోరాట పటిమ ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయొచ్చు.

DETAILS

ఉమ్మడి ఏపీలో గ్రేహోండ్స్ పేరుతో ప్రత్యేక పోలీస్ విభాగం ఏర్పాటు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదం హెచ్చుమీరిన కాలంలో భారీగా పోలీసులకు ప్రాణనష్టం సంభవించేది. కారడవుల్లో దాగి ఉండే నక్సల్స్, ఆకస్మాత్తుగా బలగాలపై, పోలీసులపై విరుచుకుపడేవారు. ఈ క్రమంలో వామపక్ష తీవ్రవాదులను నిలువరించడం సాధారణ పోలీసులకు కష్టతరమయ్యేది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ పలు ప్రయోగాలు విఫలమయ్యాయి. వామపక్ష తీవ్రవాదాన్ని అరికట్టేందుకు కేంద్ర బలగాలు సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ సహా పంజాబ్‌ కమాండోలను రంగంలోకి దింపింది అప్పటి ఏపీ సర్కార్. అయినప్పటికీ ఆశించిన మేర ఫలితం దక్కలేదు. వామపక్షాన్ని ఎదుర్కొనాలంటే జంగిల్‌ వార్‌ఫేర్‌ లో పోలీస్ సిబ్బందికి నైపుణ్య అభివృద్ధి శిక్షణను అందించాలని ఒకనాటి ఐపీఎస్‌ అధికారి కేఎస్ వ్యాస్‌ సంకల్పించారు. అనంతరం గ్రేహౌండ్స్‌ పేరుతో ఓ ప్రత్యేక విభాగాన్ని సిద్ధం చేశారు.

DETAILS

బాటీ వద్ద టెక్నిక్స్ నేర్చుకున్నా : డీజీపీ అంజనీ కుమార్

ఈ క్రమంలో పోలీసులకు తర్ఫీదునిచ్చేందుకు సశస్త్ర సీమాబల్‌ (ఎస్‌ఎస్‌బీ)లో అప్పటికే రిటైరైన భాటీని అప్పటి ఏపీ సర్కార్ ఎంపిక చేసింది. 1989లో గ్రేహౌండ్స్‌ కమాండర్ గా నియమితులైన బాటీ దాదాపు 3 దశాబ్దాల పాటు నిర్విరామంగా సేవలు అందించారు. మంగళవారం తెల్లవారుజామున మరణించిన భాటీ మృతదేహాన్ని సందర్శనార్థం అధికారులు గ్రేహౌండ్స్‌ ఆస్పత్రిలోనే ఉంచారు. బుధవారం ఉదయం జూబ్లీహిల్స్‌ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. భాటీకి సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ప్రస్తుత తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌ సైతం తన గురువును గుర్తు చేసుకున్నారు. తాను గ్రేహౌండ్స్‌ అస్సాల్ట్‌ కమాండర్‌, స్క్వాడ్రన్‌ కమాండర్‌, గ్రేహౌండ్స్‌ చీఫ్ గా పనిచేసిన క్రమంలో బాటీ వద్ద మెలకువలు నేర్చుకున్నానని జ్ఞాపకాలు నెమరేసుకుంటూ నివాళి అర్పించారు.