తదుపరి వార్తా కథనం
APPSC: గ్రూప్-2 హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ విధానం, పరీక్షా వివరాలు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 12, 2025
04:06 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 23న జరగనున్న గ్రూప్-2 పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను APPSC అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పరీక్షా సమయాలు
మొదటి సెషన్: ఉదయం 10:00 నుండి 12:30 వరకు
రెండవ సెషన్: మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 5:30 వరకు
ముఖ్య సూచనలు
పరీక్షా కేంద్రాలకు హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకురావాలి.
హాల్ టికెట్‌తో పాటు గుర్తింపు కార్డు (ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి) తీసుకురావడం మంచిది.
ఇతర వస్తువులు, పరికరాలు (మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు) పరీక్షా కేంద్రాలకు తీసుకురావద్దని సూచించింది.