NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సుప్రీంకోర్టు మెగా బదిలీలు.. రాహుల్‌ గాంధీకి స్టే నిరాకరించిన ఆ జడ్జి బదిలీ
    తదుపరి వార్తా కథనం
    సుప్రీంకోర్టు మెగా బదిలీలు.. రాహుల్‌ గాంధీకి స్టే నిరాకరించిన ఆ జడ్జి బదిలీ
    రాహుల్‌ గాంధీకి స్టే నిరాకరించిన న్యాయమూర్తి

    సుప్రీంకోర్టు మెగా బదిలీలు.. రాహుల్‌ గాంధీకి స్టే నిరాకరించిన ఆ జడ్జి బదిలీ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 11, 2023
    01:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి విధించిన రెండేళ్ల శిక్ష నిలుపుదలకు నిరాకరించిన గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హేమంత్‌ ప్రచక్‌ బదిలీ అయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

    భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం సభ్యులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా,జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌ ఆగస్టు 3న బదిలీలకు పచ్చజెండా ఊపారు.

    జులైలో మోదీ ఇంటి పేరు కేసులో విధించిన రెండేళ్ల శిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.

    ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హేమంత్‌ ప్రచక్‌ స్టేకు నిరాకరిస్తూ సంచలన తీర్పును వెలువరించారు.

    DETAILS

    2021లో గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రచక్ నియామకం

    పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు విధించిన శిక్ష న్యాయపరమైందేనని, దీన్ని నిలిపేసేందుకు ఎటువంటి కారణాలు కనిపించట్లేదన్నారు. ఫలితంగా పిటిషనర్‌ అభ్యర్థనను కొట్టివేస్తున్నట్లు జస్టిస్‌ హేమంత్‌ ప్రచక్‌ తీర్పు చెప్పారు.

    గుజరాత్ హైకోర్టులో న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం గుజరాత్ ప్రభుత్వంలో అసిస్టెంట్ ప్లీడర్‌గా విధులు నిర్వర్తించారు.

    2021లో గుజరాత్ ఉన్నతన్యాయస్థానం న్యాయమూర్తిగా నియామకమయ్యారు. ప్రస్తుతం అక్కడే పని చేస్తున్నారు.

    పాలనా సౌలభ్యం కోసమే బదిలీలు చేపట్టామని సుప్రీంకోర్టు పేర్కొంది. బదిలీల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని వివరించింది.

    ఆగస్ట్ 10న జరిగిన భేటీలో 14 మంది పేర్లను బదిలీలకు సిఫార్సు చేశారు. జస్టిస్ సమీర్ దవే, జస్టిస్ గీతా గోపీ పేర్లు జాబితాలో ఉన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ గాంధీ
    గుజరాత్
    హైకోర్టు

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    రాహుల్ గాంధీ

    కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? ఇంకా వీడని ఉత్కంఠ  కర్ణాటక
    మోదీ కంటే ముందు రాహుల్ అమెరికా పర్యటన; 10రోజులు అక్కడే  నరేంద్ర మోదీ
    సిద్ధరామయ్యను సీఎం చేసేందుకే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు; మరి శివకుమార్ పరిస్థితి ఏంటి?  కర్ణాటక
    రాజీవ్ గాంధీ వర్ధంతి: సోనియా, ఖర్గే, ప్రియాంక నివాళి; రాహుల్ భావోద్వేగ ట్వీట్  కాంగ్రెస్

    గుజరాత్

    కిరణ్ పటేల్‌: పీఎంఓ అధికారినంటూ హల్‌చల్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు; 15రోజుల జ్యుడీషియల్ కస్టడీ జమ్ముకశ్మీర్
    'మోదీ' ఇంటిపేరుపై రాహుల్ గాంధీ ఆరోపణలు; రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీ
    గుజరాత్‌లోని సింహాన్ని తరిమికొట్టిన కుక్కల గుంపు వైరల్ అవుతున్న వీడియో భారతదేశం
    ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్లపై గుజరాత్ హైకోర్టు కీలక ఆదేశాలు నరేంద్ర మోదీ

    హైకోర్టు

    వివేకా హత్యకు కుట్ర పన్నిన విషయం అవినాష్ రెడ్డికి ముందే తెలుసు: సీబీఐ వైఎస్సార్ కడప
    వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట; ఏప్రిల్ 25వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం  ఆంధ్రప్రదేశ్
     వైఎస్ వివేకా హత్య కేసు: అవినాష్‌రెడ్డి బెయిల్‌పై స్టే విధించిన సుప్రంకోర్టు  సుప్రీంకోర్టు
    తెలంగాణ హైకోర్టు ఆదేశాలను కొట్టేసిన సుప్రీంకోర్టు; అవినాష్ రెడ్డి అరెస్టుకు లైన్ క్లియర్  సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025