Page Loader
Gujarat: గుజరాత్‌లో పెను ప్రమాదం.. నర్మదా నదిలో స్నానానికి దిగి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి 
నర్మదా నదిలో స్నానానికి దిగి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి

Gujarat: గుజరాత్‌లో పెను ప్రమాదం.. నర్మదా నదిలో స్నానానికి దిగి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
May 15, 2024
12:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

గుజరాత్‌లోని పోయిచాలో నర్మదా నదిలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు గల్లంతయ్యారు. వీరు మంగళవారం మధ్యాహ్నం నర్మదా నదిలో ఈత కొట్టేందుకు వచ్చినట్లు సమాచారం. అయితే బలమైన ప్రవాహం రావడంతో ఏడుగురు మునిగిపోయారు. ఈసంఘటన తర్వాత,NDRF,వడోదర అగ్నిమాపక దళం బృందాలు వారి కోసం వెతకటం ప్రారంభించింది. బాధితులంతా సూరత్ నుంచి పోయిచాకు వచ్చిన బృందంలోని వారని పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జరోడ్ నుండి 6బిఎన్ ఎన్‌డిఆర్‌ఎఫ్ యూనిట్ మధ్యాహ్నం సంఘటనా స్థలానికి చేరుకుంది. పోయిచా నర్మదా నది ఒక ప్రసిద్ధ వేసవి పిక్నిక్ స్పాట్.లైసెన్స్ లేకుండా బోట్లు నడపరాదని ఇటీవల నర్మదా జిల్లా యంత్రాంగం స్థానిక బోట్ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నర్మదా నదిలో గల్లంతైన ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు