Gujarath-Pakistanis-arrested-Drugs:గుజరాత్ తీరంలో 14 మంది పాకిస్థానీల అరెస్టు…రూ.602 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
గుజరాత్ తీరంలో(Gujarath Coastal)యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ATS)నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB)కలసి పాకిస్థాన్(Pakistan) చెందిన 14 మంది అరెస్టు చేశారు. అక్రమంగా భారత జలాల్లోకి ప్రవేశించడమే కాకుండా అక్రమంగా భారత్ లోకి డ్రగ్స్ ను తరలించేందుకు ప్రయత్నించారు. విశ్వసనీయ సమాచారంతో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో పాకిస్థాన్ కు చెందిన 14 మంది వ్యక్తులను పట్టుకుని అరెస్టు చేశారు. వీరి వద్దనుంచి రూ. 602 కోట్ల విలువైన 86 కిలోల బరువున్న నిషేధిత డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆపరేషన్ సమయంలో భారత అధికారులనుంచి తప్పించుకునేందుకు వారిపైకి బోట్ ను నడిపారు.
ఒకరోజు ముందే గుజరాత్, రాజస్థాన్ లలో డ్రగ్స్ పట్టివేత
దీంతో పోలీసులు వారిపైకి కాల్పులు జరిపి వారిని పట్టుకున్నారు. భారత భద్రతా దళాలు గత రెండు రోజులుగా అంతర్జాతీయ సముద్ర సరిహద్దు, భారత ప్రాదేశిక జలాల పరిధిలో తనిఖీలు నిర్వహిస్తుండగా వీరు ప్రయాణిస్తున్న బోట్ కంటబడింది. వెంటనే భారత భద్రతా దళాలు చాకచక్యంగా వ్యవహరించి వీరిని పట్టుకున్నారు. శనివారం గుజరాత్, రాజస్థాన్ లలో 'మియావ్ మియావ్'గా ప్రసిద్ధి చెందిన నిషేధిత డ్రగ్ మెఫెడ్రోన్‌ను తయారు చేస్తున్న మూడు ల్యాబ్‌లను ఎన్సీబీ తనిఖీ చేసి సుమారు రూ.300 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్, రాజస్థాన్‌లలో డ్రగ్ మెఫెడ్రోన్‌ను తయారు చేస్తున్నల్యాబ్‌లను ఎన్సీబీ సీజ్ చేసింది. ఈ ఘటన జరిగిన తర్వాతిరోజే భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం విశేషం.