కేంద్ర మంత్రి లక్నోనివాసం వద్ద యువకుడి మృతదేహం.. మంత్రి కొడుకుపైనే అనుమానాలు
ఉత్తర్‌ప్రదేశ్ లోని లక్నోలో శుక్రవారం తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతంలో బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ నివాసం వద్ద ఓ యువకుడు కాల్చి చంపబడ్డాడు. ఘటనా స్థలంలో దొరికిన లైసెన్స్‌డ్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అది మంత్రి కుమారుడి పేరుతో ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి స్పందిస్తూ.. ఘటన జరిగిన సమయంలో తన కుమారుడు ఇంట్లో లేడని పేర్కొన్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. బాధితుడు వికాస్ శ్రీవాస్తవ, కౌశల్ కిషోర్ కొడుకు స్నేహితుడని పోలీసులు తెలిపారు.