
JammuKahmir: జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని ఉదంపూర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు.
బుధవారం, ఆర్మీ ప్రత్యేక బలగాలు, జమ్ముకశ్మీర్ పోలీసులు కథువా జిల్లాలో నిర్వహించిన ఆపరేషన్‌లో కూడా ముగ్గురు ఉగ్రవాదులు కాల్చిచంపబడ్డారు.
ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.అందిన సమాచారం ప్రకారం, జైష్-ఎ-మహ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థకు చెందిన భారీ ఆయుధాలు కలిగిన నలుగురు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో ఉన్నారని సమాచారం అందడంతో భద్రతా బలగాలు వారిని చుట్టుముట్టాయి.
2019 పుల్వామా బాంబు పేలుడుతో సహా దేశంలో జరిగిన అనేక ఘోరమైన దాడులకు నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ కారణం అన్న విషయం తెలిసిందే.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఉధంపూర్ బసంత్‌గఢ్ ఎన్‌కౌంటర్
Exclusive:.
— War & Gore (@Goreunit) September 11, 2024
Udhampur Basantgarh encounter
3 JeM(Banner KT) Terrorists have been killed by 1 Para SF in ongoing Encounter. Bodies will be retrieved soon. Stay tuned pic.twitter.com/pT5mqm2lRe