తదుపరి వార్తా కథనం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో తుపాకుల మోత.. ఎన్‌కౌంటర్‌లో 28 మావోయిస్టుల మృతి
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 21, 2025
12:35 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం మళ్లీ తుపాకుల మోతతో తడిసి ముద్దయింది. నారాయణపూర్ జిల్లా అడవుల్లో మంగళవారం జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో భద్రతా దళాలు భారీ విజయాన్ని నమోదు చేశాయి.
జరిగిన ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోయిస్టులు మృతిచెందారు. హతమైన వారిలో నక్సల్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నట్టు సమాచారం.
ఈ ఎదురుకాల్పుల్లో మరికొంతమంది మావోయిస్టులు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం అందుతోంది. భద్రతా దళాలకు మాధ్ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై ముందస్తు సమాచారం అందింది.
దీంతో బలగాలు వెంటనే ఆ ప్రాంతాన్ని ముట్టడించి ఆపరేషన్ చేపట్టాయి. ఈ భారీ ఆపరేషన్‌లో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) బలగాలు భాగస్వామ్యమయ్యాయి.