Page Loader
అంద‌రికీ ఫ్రీగా గుర్బానీ ప్రసారం.. పంజాబ్ అసెంబ్లీలో కీలక బిల్లుకు ఆమోదం
పంజాబ్ అసెంబ్లీలో కీలక బిల్లుకు ఆమోదం

అంద‌రికీ ఫ్రీగా గుర్బానీ ప్రసారం.. పంజాబ్ అసెంబ్లీలో కీలక బిల్లుకు ఆమోదం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 20, 2023
06:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్ ముఖ్యమంత్రి భ‌గ‌వంత్‌మాన్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రసిద్ధ స్వ‌ర్ణ దేవాల‌యం నుంచి వ‌చ్చే గుర్బానీ ఇకపై ఉచితంగా ప్ర‌సారం చేస్తామని వెల్లడించారు. సిక్కు గురువులు, రచయితలు కంపోజ్ చేసిన ప‌విత్ర కీర్త‌న‌ల‌ను గుర్బానీ అని పిలుస్తారు. బ్రిటీష్ కాలం నాటి గురుద్వారాల చ‌ట్టాన్ని సవరిస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సిక్కు గురుద్వారాల‌ స‌వ‌ర‌ణ బిల్లు 2023ని శాసనసభ ఆమోదించింది. గుర్బానీ ప్ర‌సార హ‌క్కుల్ని కేవలం ఓ ప్రైవేట్ ఛాన‌ల్‌కే ప‌రిమితం కాకుండా అంద‌రికీ ఆయా శ్లోకాలు ఉచితంగా అందిస్తామన్నారు. టెండ‌ర్‌ ప్రక్రియతో నిమిత్తం లేకుండా గుర్బానీని అంద‌రికీ ఫ్రీగా బ్రాడ్‌ కాస్ట్ చేస్తామని సభలో సీఎం తెలిపారు.

DETAILS

గుర్బానీ ప్రసారం ఇక ఏ ఒక్క ఛానెల్ కు పరిమితం కాదు : పంజాబ్ ప్రభుత్వం 

తాజాగా బ్రిటీష్ కాలం నాటి సిక్కు గురు ద్వారా చ‌ట్టం 1925కి పంజాబ్ సర్కార్ స‌వ‌ర‌ణ‌లు చేయగా, సోమ‌వారం క్యాబినెట్ ఆమోదించింది. అనంతరం నేడు అసెంబ్లీలో బిల్లును ఆమోదించారు. ఈ నేపథ్యంలో పీటీసీ ఛాన‌ల్ హ‌క్కులకు ఫుల్ స్టాప్ పడింది. మరోవైపు సిక్కు మ‌త ప్ర‌చారాకుల‌పై ఉన్న నియంత్ర‌ణ‌ను సైతం స‌వ‌ర‌ణ చ‌ట్టం తొల‌గించింది. సెక్ష‌న్ 125 ఏ స‌వ‌ర‌ణ‌ ద్వారా ఇక నుంచి గుర్బానీ ప్ర‌సారాలు అందరికీ ఫ్రీగానే జ‌ర‌గ‌నున్నాయి. గుర్బానీ అనేది సిక్కు మతస్తుల పవిత్ర శ్లోకం. ప్రస్తుతం ఈ శ్లోకం టెలికాస్టింగ్ రైట్స్ పీటీసీ అనే ఓ ప్రైవేట్ ఛానల్ వద్ద మాత్రమే ఉన్నాయి. అలా కాకుండా ఉచిత ప్రసారం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పాత చట్టాలను సవరించింది.