Page Loader
ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం
ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం

ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం

వ్రాసిన వారు Stalin
Feb 14, 2023
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌ నగరంలో ఘోరం జరిగింది. 27ఏళ్ల మహిళా టెక్కీకి మత్తుమందు ఇచ్చి సహారా మాల్‌లోని బేస్‌మెంట్‌లో పార్క్ చేసిన తన కారులోనే నిందితుడు అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అయిన మహిళను ఉద్యోగం కోసం నిందితుడు ఇంటర్వ్యూకు పిలిచాడు. అనంతరం మత్తుమందు కలిపిన నీళ్లను ఆమెతో తాగించాడు. తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. సెక్టార్ 51లోని మహిళా పోలీస్ స్టేషన్‌లో ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిపై సెక్షన్ 328, 376, 506 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

గురుగ్రామ్

ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు: బాధితురాలు

ఆన్‌లైన్‌లో ఉద్యోగం కోసం వెతుకుతున్న క్రమంలో తుషార్ శర్మ అనే వ్యక్తిని సంప్రదించానని, అతను తనకు ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. గత శనివారం సహారా మాల్‌లో ఇంటర్వ్యూ కోసమని ఆమెకు తుషార్ ఫోన్ చేశాడు. తన సర్టిఫికెట్లతో మధ్యాహ్నం 1 గంటలకు మాల్‌కు చేరుకున్నానని, అనంతరం శర్మను కలుసుకున్నానని చెప్పింది. ఈ క్రమంలో తుషార్ శర్మ తనకు నీటిని అందించాడని, దానిని సేవించిన తర్వాత స్పృహ కోల్పోయినట్లు బాధితురాలు ఫిర్యాదులో వివరించింది. ఆ తర్వాత శర్మ తనను తన కారులోకి తోసి అత్యాచారం చేశాడని బాధితురాలు చెప్పింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి, మాల్ పార్కింగ్‌లో వదిలేసి పారిపోయినట్లు బాధితురాలు వాపోయింది.