LOADING...
UP Assembly:యూపీ అసెంబ్లీలో గుట్కా నిషేధం.. స్పీకర్‌ కీలక ఆదేశం!
యూపీ అసెంబ్లీలో గుట్కా నిషేధం.. స్పీకర్‌ కీలక ఆదేశం!

UP Assembly:యూపీ అసెంబ్లీలో గుట్కా నిషేధం.. స్పీకర్‌ కీలక ఆదేశం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 05, 2025
04:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న వేళ, అసెంబ్లీ ప్రాంగణంలో గుట్కా తిని కార్పెట్‌పై ఉమ్మివేయడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై స్పీకర్‌ సతీశ్‌ మహాన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అసెంబ్లీ ప్రాంగణంలో గుట్కా వినియోగంపై నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Details

స్పీకర్‌ ఆగ్రహం.. అసెంబ్లీలో క్రమశిక్షణపై కఠిన నిర్ణయం

మంగళవారం బడ్జెట్‌ సమావేశానికి ముందు స్పీకర్‌ సతీశ్‌ మహాన అసెంబ్లీలోకి ప్రవేశిస్తున్న సమయంలో కార్పెట్‌పై గుట్కా మరకలను గమనించారు. ఈ నిర్వాకానికి పాల్పడిన ఎమ్మెల్యే ఎవరో తనకు తెలుసని, అయితే వారిని బహిరంగంగా ప్రస్తావించనని తెలిపారు. అయితే ఇకపై ఇలాంటి చర్యలను సహించమని స్పష్టం చేశారు. సభ్యులంతా అసెంబ్లీని పరిశుభ్రంగా ఉంచే బాధ్యత వహించాలని సూచించారు. తప్పిదాన్ని అంగీకరించకపోతే చర్యలు సభ్యుల్లో ఒక్కరు తప్పుడు ప్రవర్తన చేస్తే, మొత్తం అసెంబ్లీ గౌరవానికి భంగం కలగొద్దని స్పీకర్‌ వ్యాఖ్యానించారు. కార్పెట్‌పై గుట్కా మరకలు పడటంతో, సంబంధిత వ్యక్తిని తప్పును అంగీకరించాల్సిందిగా సూచించారు. లేనిపక్షంలో ఆయన్ను స్వయంగా పిలిపించుకుంటానని హెచ్చరించారు.

Details

 గుట్కా, పాన్‌ మసాలా వినియోగంపై  నిషేధం 

ఈ ఘటనకు సంబంధించి అసెంబ్లీ ప్రాంగణంలో ఇకపై గుట్కా, పాన్‌ మసాలా వంటి పదార్థాల వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. నిబంధనలను ఉల్లంఘించే సభ్యులపై రూ.1000 జరిమానా విధించనున్నట్లు తెలిపారు.