తదుపరి వార్తా కథనం

Guvvala Balaraju: బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
వ్రాసిన వారు
Sirish Praharaju
Aug 10, 2025
12:36 pm
ఈ వార్తాకథనం ఏంటి
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. ఆదివారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, బీజేపీ కండువా కప్పి ఆయనను అధికారికంగా పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణతో పాటు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తనను ఆకర్షించాయని, ఆ కారణంగానే పార్టీలో చేరినట్లు బాలరాజు తెలిపారు. తెలంగాణలో బీజేపీ బలపరచడంలో బాలరాజు సేవలను సమర్థంగా వినియోగించుకుంటామని రామచందర్‌రావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు pic.twitter.com/RpEeanSL4N
— greatandhra (@greatandhranews) August 10, 2025