Page Loader
ఎయిర్‌పోర్టుల్లో ప్రార్థనా గది ఏర్పాటు కోరుతూ పిల్‌.. కొట్టేసిన గువహటి హైకోర్టు
కొట్టేసిన గువహటి హైకోర్టు

ఎయిర్‌పోర్టుల్లో ప్రార్థనా గది ఏర్పాటు కోరుతూ పిల్‌.. కొట్టేసిన గువహటి హైకోర్టు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 20, 2023
08:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

అస్సాం గువహటిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆవరణలో ప్రత్యేక ప్రార్థన గదిని ఏర్పాటు చేయాలని కోరుతూ పిల్ దాఖలైంది. దీన్ని విచారించిన ఉన్నత న్యాయస్థానం ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టేసింది. ఈ మేరకు పిటిషన్ ను గౌహతి హైకోర్టు గురువారం తోసిపుచ్చింది. పిటిషన్ విచారణలో భాగంగా హైకోర్టు పిటిషన్లను ప్రశ్నించింది. ఈ విషయంలో ప్రాథమిక హక్కు ఏమిటి ? మన దేశం సెక్యులర్ దేశమా ? ఫలానా కమ్యూనిటీకి ప్రార్థన గది ఎందుకు ? ప్రాథమిక హక్కును అమలు చేయడం కోసం పిల్ దాఖలు చేయవచ్చు. ఆర్టికల్ 226 ద్వారా పొందిన రిట్ అధికార పరిధిని అమలు చేస్తున్నప్పుడు, ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోమని అడగలేమని ధర్మాసనం పేర్కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పిల్ దాఖలుపై పిటిషనర్ ను ప్రశ్నించిన హైకోర్టు