Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్ జీతం ఎంత? CECకి లభించే సౌకర్యాలు ఇవే...
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ జీతం,ప్రోత్సాహకాలు, ఆస్తుల వివరాలపై చర్చ జరుగుతోంది. ఎన్నికల సంఘంపై ప్రతిపక్షాలు'సేవ్ డెమోక్రసీ'పేరుతో ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో ఆయన వ్యక్తిగత, వృత్తిపరమైన వివరాలు తెరపైకి వచ్చాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR),'ఫారం-6'లో మార్పులపై ప్రతిపక్షాలు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికల సంఘం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని, ఓట్ల అక్రమాలకు అవకాశం కల్పిస్తోందని ఆరోపిస్తూ దిల్లీలోని నిర్వచన్ సదన్ వైపు మార్చ్ నిర్వహించాయి. ప్రస్తుతం CEC జ్ఞానేశ్ కుమార్‌కు నెలకు రూ.2.50లక్షల ప్రాథమిక వేతనం లభిస్తోంది. ఇది క్యాబినెట్ కార్యదర్శి వేతనంతో సమానం. నెలకు రూ.34 వేల అలవెన్స్,కుటుంబ సభ్యులతో సహా LTC,ప్రభుత్వ నివాసం,డ్రైవర్‌తో కూడిన అధికారిక వాహనాలు,భద్రత,విద్యుత్,నీరు,టెలిఫోన్ సదుపాయాలు,వైద్య సేవలు వంటి ప్రయోజనాలు అందుతాయి.
వివరాలు
1988 బ్యాచ్ కేరళ క్యాడర్ IAS అధికారి
పదవీ విరమణ అనంతరం కూడా పెన్షన్, ఇతర ప్రయోజనాలు ఉంటాయి.
1988 బ్యాచ్ కేరళ క్యాడర్ IAS అధికారి అయిన జ్ఞానేశ్ కుమార్ 2024లో ఎన్నికల కమిషనర్‌గా, 2025 ఫిబ్రవరిలో CECగా బాధ్యతలు చేపట్టారు.
గతంలో కేంద్ర సహకార శాఖ కార్యదర్శిగా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పనిచేశారు.
ఆర్టికల్ 370 రద్దు సమయంలో హోంశాఖలో కశ్మీర్ విభాగం జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. 2007-12 మధ్య రక్షణ ఉత్పత్తి శాఖలోనూ పనిచేశారు.
1964 జనవరి 27న ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన ఆయన IIT కాన్పూర్‌లో సివిల్ ఇంజినీరింగ్‌లో BTech చేశారు. హార్వర్డ్‌లో ఎకనామిక్స్‌లో PG చేశారు. ఆయన ఇద్దరు కుమార్తెలు కూడా ప్రభుత్వ సేవల్లో ఉన్నారు.
వివరాలు
జ్ఞానేశ్ కుమార్ ఆస్తుల వివరాలు వెల్లడించాల్సిందేనన్న గోఖలే
జ్ఞానేశ్ కుమార్ మొత్తం నికర ఆస్తులపై ప్రస్తుతం బహిరంగ సమాచారం లేదు.
2025 నవంబర్‌లో మాజీ TMC ఎంపీ సాకేత్ గోఖలే ఆయన 2015-23 మధ్య సమర్పించిన స్థిరాస్తుల వివరాలను RTI ద్వారా కోరారు.
అయితే వ్యక్తిగత సమాచారం మినహాయింపు కింద ఆ వివరాలను వెల్లడించలేమని ప్రభుత్వం తెలిపింది.
అయితే ప్రజాప్రయోజనం, పారదర్శకత దృష్ట్యా ఆస్తుల వివరాలు వెల్లడించాల్సిందేనని గోఖలే వాదించారు.