Gyanesh Kumar: సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్ కుమార్.. ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత దేశ కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.
బుధవారం ఉదయం ఆయన అధికారికంగా బాధ్యతలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆయనను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా (సీఈసీ) నియమించింది.
అర్ధరాత్రి సమయంలో ఈ ప్రకటనను విడుదల చేయడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది.
ముఖ్యంగా, అర్ధరాత్రి సమయంలోనే సీఈసీ నియామకాన్ని ప్రకటించాల్సిన అవసరం ఏమిటి? అంటూ కాంగ్రెస్ ప్రశ్నించింది.
ఈ నియామకాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి, ఇవి బుధవారం విచారణకు రానున్నాయి.
వివరాలు
జనవరి 26, 2029 వరకు సీఈసీ హోదాలో
జ్ఞానేష్ కుమార్ జనవరి 26, 2029 వరకు సీఈసీ హోదాలో కొనసాగనున్నారు.
ఈ ఏడాది చివరిలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఆయన నేతృత్వంలోనే జరగనుంది.
అంతేకాకుండా, 2025లో జరిగే పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను కూడా ఆయన పర్యవేక్షించనున్నారు.
జ్ఞానేష్ కుమార్ 1988 బ్యాచ్‌కు చెందిన కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి. గతంలో సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా సేవలు అందించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్ కుమార్
#WATCH | Delhi: Election Commissioner Dr. Sukhbir Singh Sandhu greets Chief Election Commissioner Gyanesh Kumar as he takes charge of the office. pic.twitter.com/cdo2wrzdmF
— ANI (@ANI) February 19, 2025