Telangana: తెలంగాణలో శుక్రవారం నుంచి ఒంటిపూట బడులు
తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు శుభవార్త. రోజుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల మార్చి 15 నుండి పాఠశాలలకు ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయించింది. స్కూల్స్ ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12.30 వరకు మాత్రమే పనిచేస్తాయి. పాఠశాల విద్యా శాఖ 2023-24 విద్యా సంవత్సరం చివరి పనిదినం వరకు అంటే ఏప్రిల్ 23. మధ్యాహ్న రోజు వరకు అన్ని మేనేజ్‌మెంట్‌ల పరిధిలోని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లకు హాఫ్-డే పాఠశాలలను ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెట్టిన అనంతరం విద్యార్థులకు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.