Page Loader
బంగాళాఖాతంలో ముంచుకొస్తున్న హమూన్ తుఫాను ముప్పు.. ఉత్తరాంధ్ర పై ప్ర‌భావం
ఉత్తరాంధ్ర పై ప్ర‌భావం

బంగాళాఖాతంలో ముంచుకొస్తున్న హమూన్ తుఫాను ముప్పు.. ఉత్తరాంధ్ర పై ప్ర‌భావం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 23, 2023
06:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం రెండు తుఫానులను ఎదుర్కోనుంది. దీంతో అక్టోబర్ చివరి వారంలో తీవ్ర‌ ప్ర‌భావితమయ్యే ప్రమాదం ఉంది. బంగాళాఖాతంలో ఒకటి, అరేబియా సముద్రంలో మరోకటి ఏర్పడ్డాయి. అరేబియాలో 'తేజ్' అనే తుఫాను అల‌జ‌డి రేపుతోంది.ఇంకోవైపు 'హమూన్' బంగాళాఖాతంలో ఏర్ప‌డనుంది. ఇప్పటికే తేజ్‌ తుఫాన్ ప్రభావం చూపుతుండగా, బంగాళాఖాతంలో ఏర్పడిన హమూన్ ముంచుకొస్తోంది. ఈ మేరకు భారత వాతావ‌ర‌ణ కేంద్రం, అమరావతి వెల్లడించింది. ఫలితంగా ఉత్తరాంధ్రపై తీవ్ర ప్ర‌భావం ఉండే అవకాశమున్నట్లు పేర్కొంది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో అక్టోబర్ 21న అల్పపీడనం బలపడి తుఫానుగా మారనుంది. ఇది వాయువ్య దిశగా పయనిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మంగళవారం వరకు అల్పపీడనంగా మారనుంది. తుఫాన్‌ ప్రభావంతో ఉత్తరాంధ్రలోని ప‌లు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముంద‌ని వివరించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఉత్తరాం ధ్రలోని ప‌లు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఒడిశా తీరాన్ని ప్రభావితం చేస్తున్న హమూన్ తుపాను