
Mlc Kavitha: కేసీఆర్‌పై సీబీఐ విచారణకు హరీశ్ రావు-సంతోష్ కారణం.. కవిత సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ అసెంబ్లీ ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె హరీశ్ రావు, సంతోష్ రావు కారణంగానే కేసీఆర్ మీద అవినీతి మచ్చలు పడినట్లు, BRS రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే హరీశ్ రావును ఇరిగేషన్ శాఖ నుండి తొలగించారన్నారు. కొంతమంది వ్యక్తులు తమ ఆస్తులను పెంచుకోవడానికి చేసిన చర్యల వల్ల కేసీఆర్ మీద విచారణకు దారితీసినట్లు అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఎందుకు మౌనంగా ఉందని ఆమె నిలదీశారు.
Details
ఇంత జరిగినా ఎందుకు స్పందించలేదు
కేసీఆర్ మీద విచారణకు ఆదేశాలు వచ్చినా పార్టీ ఎందుకు సైలెంట్ గా ఉంది? తెలంగాణ బంద్ కు ఎందుకు పిలుపునివ్వలేదు? ఇంత జరిగాక పార్టీ కింద పడితే ఎంత, లేకపోతే ఎంత? అని హాట్ కామెంట్స్ చేశారు. తన వ్యాఖ్యల వల్ల లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీకి నష్టం అయినా, అన్ని వాస్తవాలను బయటపెడుతున్నట్లు, తనపై కుట్రలు జరిగినా భరించానని, కానీ కేసీఆర్‌పై చేసిన ఆరోపణలను మన్నించేది కాదని హెచ్చరించారు.
Details
హరీశ్, సంతోష్ వల్లే కేసీఆర్‌కు చెడ్డ పేరు
హరీశ్ రావు, సంతోష్ రావు కారణంగానే కేసీఆర్ పేరు బద్నాం అయిందని. కేసీఆర్ ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు, వీరు వ్యక్తిగత లాభాల కోసం పని చేశారు. హరీశ్, సంతోష్ తనపై ఎన్నోసారి కుట్రలు చేశారని ఆరోపించారు. కవిత ఆరోపణల ప్రకారం, హరీశ్, సంతోష్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని, కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్న భాగంలో నిప్పులు పెట్టడం వల్ల మొత్తం ప్రాజెక్టుకు హాని చేరిందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మహా సముద్రం లాంటి ప్రాజెక్ట్ అని, దాని కొన్ని భాగంలో సమస్యలు వచ్చినా మొత్తం ప్రాజెక్ట్ విలువ తగ్గకూడదని తెలిపారు. కేసీఆర్ వంటి మహా నేతపై ఇలాంటి నిందలు వేయడం దారుణమని వాపోయారు.
Details
200 సంవత్సరాల తర్వాత కూడా కేసిఆర్‌ను గుర్తిండిపోతారు
200 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను గుర్తిస్తారని, అయితే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్ వ్యతిరేకంగా పని చేసిన వ్యక్తి అని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ పై ఇంత కుట్రపూరిత ఆరోపణలు ఎందుకు? అవి ఎవరిచ్చారో BRS శ్రేణులు, ప్రజలు ఆలోచించాలన్నారు. వాస్తవాలు చేదుగా ఉన్నా, మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు.