జాక్‌పాట్ కొట్టిన హరిత కర్మసేన మహిళలు.. ఏకంగా రూ.10 కోట్లు గెలిచారు
ఈ వార్తాకథనం ఏంటి
మున్సిపాలిటీలో ఓ సంస్థ తరుపున పనిచేసే మహిళలకు జాక్ పాట్ తగిలింది. రూ.250 పెట్టి లాటరీ టికెట్టు కొన్న 11 మంది మహిళలకు రూ.10 కోట్ల బంపర్ లాటరీ తగిలింది.
కేరళలోని పరప్పన్‌గడి మున్సిపాలిటీలో హరిత కర్మసేన తరుపున పనిచేసే మహిళలకు ఈ అదృష్టం వరించింది.
ఈ కర్మసేన్ కు చెందిన మహిళలంతా నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను సేకరించి రిసైక్లింగ్ ప్లాంట్ కు తరలిస్తారు. అలా వచ్చిన ఆదాయంతోనే కుటుంబాన్ని పోషిస్తున్నారు.
ప్రభుత్వం నిర్వహించే లాటరీలో వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్నారు. దీని కోసం గ్రూపులో ఉన్న 11 మంది మహిళలు చందాలు వేసుకొని రూ.250 జమ చేసి వాటితో ఓ లాటరీ టికెట్ కొన్నారు.
Details
సంతోషం వ్యక్తం చేసిన నిరుపేద మహిళలు
కేరళ లాటరీ డిపార్టుమెంటు లాటరీ నిర్వహించగా ఇందులో ఆ మహిళలకు రూ.10 కోట్ల విలువైన మానసూన్ బంపర్ లాటరీ దక్కింది. దీంతో ఆ నిరుపేద మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.
రాత్రికి రాత్రే వారు కోటీశ్వరులు కావడంతో వారి బంధువులు, స్నేహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కేరళ లాటరీ వల్ల కుటంబంలోని సమస్యలు తీరుతాయని, ఆ డబ్బును 11 మంది సమానంగా పంచుకుంటామని మహిళలు వెల్లడించారు.
అదే విధంగా కేరళ లాటరీ మహిళలకు తగలడంతో కొందరు మున్సిపల్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు.