Page Loader
Election Commission Results: హర్యానా, J&K ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు.. హ్యాట్రిక్ దిశగా బీజేపీ.. ఎన్సీ-కాంగ్రెస్‌ ఖాతాలో జమ్మూకశ్మీర్‌
హ్యాట్రిక్ దిశగా బీజేపీ.. ఎన్సీ-కాంగ్రెస్‌ ఖాతాలో జమ్మూకశ్మీర్‌

Election Commission Results: హర్యానా, J&K ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు.. హ్యాట్రిక్ దిశగా బీజేపీ.. ఎన్సీ-కాంగ్రెస్‌ ఖాతాలో జమ్మూకశ్మీర్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2024
01:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానా, జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తారుమారు చేశాయి. హర్యానాలో ఉత్కంఠభరిత పోరు జరుగుతోంది.బీజేపీ హ్యాట్రిక్‌ సాధించే దిశగా ముందుకెళ్తోంది. మొదట కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉన్నప్పటికీ, అనూహ్యంగా బీజేపీ పుంజుకుని మెజారిటీ మార్క్‌ను దాటింది. బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా వెళ్తోంది. ఇక, జమ్మూ కశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ - కాంగ్రెస్‌ కూటమి ఓటర్ల నుండి స్పష్టమైన మెజారిటీని పొందినట్లు కనిపిస్తోంది.

వివరాలు 

మధ్యాహ్నం 1.30 గంటల వరకు వచ్చిన ఫలితాల ప్రకారం

హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 46 స్థానాలు అవసరం. భాజపా ప్రస్తుతానికి 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌ 37 స్థానాలకు పరిమితమైంది. ఐఎన్‌ఎల్‌డీ 2 స్థానాల్లో, ఇతరులు 4 స్థానాల్లో (ఆధిక్యం/గెలుపు) కొనసాగుతున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఒక్క సీటు కూడా సాధించలేదు. జమ్మూ కశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ 43 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. భాజపా 28 స్థానాల్లో, పీడీపీ 2, కాంగ్రెస్‌ 7 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇతరులు 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ భాజపా, పీడీపీ స్వతంత్రంగా పోటీ చేయగా, కాంగ్రెస్‌ మరియు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పొత్తులో ఉన్నారు.