Page Loader
MLC Kavitha: కవిత అప్పీల్‌పై ఈడీకి ఢిల్లీ హైకోర్టు నోటీసు.. పిటిషన్‌పై విచారణ ఈ నెల 24కు వాయిదా.. 
MLC Kavitha: కవిత పిటిషన్‌పై విచారణ ఈ నెల 24కు వాయిదా..

MLC Kavitha: కవిత అప్పీల్‌పై ఈడీకి ఢిల్లీ హైకోర్టు నోటీసు.. పిటిషన్‌పై విచారణ ఈ నెల 24కు వాయిదా.. 

వ్రాసిన వారు Sirish Praharaju
May 10, 2024
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ కేసులో కవిత తీహార్ జైలులో ఉన్నారు. కవిత బెయిల్ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని జస్టిస్ స్వర్ణ్ కాంత శర్మ ఈడీని కోరారు. దీంతో కేసు తదుపరి విచారణకు మే 24వ తేదీని ఖరారు చేశారు. కవిత బెయిల్ పిటిషన్‌ను మే 6న ప్రత్యేక కోర్టు తిరస్కరించడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.

Details

 కొత్త ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం 

కవితని మార్చి 15న హైదరాబాద్‌లోని ఆమె నివాసం నుంచి ఈడీ అరెస్ట్ చేసింది.అంతకుముందు ఆమె నివాసంలో కూడా సోదాలు నిర్వహించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రధాన కుట్రదారుల్లో కవిత ఒకరని, ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల లంచం ఇవ్వడంలో కూడా ఆమె పాత్ర ఉందని ED ఆరోపించింది. ఏప్రిల్ 11న కవితను కూడా సిబిఐ అరెస్టు చేసింది. మరోవైపు,ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)త్వరలో కొత్త ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,కవిత,ఇతరులను అందులో నిందితులుగా చేర్చవచ్చు. ఈ మేరకు గురువారం అధికారిక వర్గాలు వెల్లడించాయి.