
MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా.. ఇక జైలులోనే!
ఈ వార్తాకథనం ఏంటి
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసులో తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ మరోసారి వాయిదా పడింది.
సోమవారం కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ వచ్చింది. అయితే ఈ పిటిషన్ పై విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది.
Details
నాలుగు నెలలుగా జైలులోనే కవిత
సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆమె తరుపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన కవిత దాదాపు నాలుగు నెలలుగా తీహార్ జైలులోనే ఉన్నారు.
సీఆర్పీసీ167(2) ప్రకారం కవిత డిఫాల్ట్ బెయిల్ పొందే అర్హత ఉందని, ఒకవేళ ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడే కేసులో 60 రోజులు వరకు మాత్రమే కస్టడీకి తీసుకోవాలని ఆమె తరుపున న్యాయవాదులు గతంలో వాదనలు వినిపించారు.
Details
అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న కవిత
కవిత తరుపున న్యాయవాదులు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని కోరగా, ఆ పిటిషన్‌ను మరోసారి ఢిల్లీ కోర్టు వాయిదా వేసింది.
దీంతో ఆమె ఇంకా కొంతకాలం జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న కవితకు ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు చేయనున్నారు.