Delhi Excise Policy Case: కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశే ఎదురైంది బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో తనకు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో కవిత బెయిల్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చెయ్యగా.. ఈడీ కౌంటర్ దాఖలు చేయలేదు. కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు టైం ఇవ్వాలని వారు ధర్మాసనాన్ని కోరారు. ఈడీ అభ్యర్థనపై కౌంటర్ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు సమయం ఇచ్చింది.
వచ్చే మంగళవారానికి విచారణ వాయిదా
కౌంటర్ దాఖలు గురువారంలోగా చేయాలని ఈడీని ఆదేశించింది.కవిత తరఫున న్యాయవాది రిజాయిండర్ శుక్రవారం లోపు దాఖలు చేయాలని ఆదేశించింది. వచ్చే మంగళవారానికి (ఆగస్ట్ 27) సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ఈ ఏడాది మార్చి 15న హైదరాబాద్‌లో ఈడీ అరెస్ట్ చేసి, మార్చి 16న ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా.. కోర్టు అనుమతితో కవితను ఈడీ కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.