
Heatwave: ఆంధ్రప్రదేశ్‌లో వడగాలుల మోత.. 31 మండలాల్లో తీవ్రమైన వేడీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఎండల ప్రభావం పెరిగింది. ఆదివారం తీవ్ర గ్రీష్మ తాపం ప్రజలను ఇబ్బందులను పడుతోంది.
నంద్యాల జిల్లా అవుకులో అత్యధికంగా 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
అలాగే వెంకటగిరి (తిరుపతి), నగరి (చిత్తూరు), పునుగోడు (ప్రకాశం)లో 42.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, ఏలూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వడగాలులు బలంగా వీస్తున్నాయి.
వడగాలుల తీవ్రత రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశముంది.
Details
కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
సోమవారం కూడా రాష్ట్రంలోని 31 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 20 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు.
ఇక వాతావరణ శాఖ అంచనా ప్రకారం, రానున్న మూడు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
ఆదివారం వైఎస్సార్, కర్నూలు, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, పార్వతీపురం మన్యం, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు నమోదయ్యాయి.