రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు భారీ ప్రమాదం; కార్లు ధ్వంసం
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ భారీ ప్రమాదానికి గురైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఈ ఘటన జరిగింది. అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రత్యేక్ష సాక్షులు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లోని 4 కార్లు, మీడియా సిబ్బంది ప్రయాణిస్తున్న రెండు కార్లు మితిమీరిన వేగంతో వెళ్లగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదం ప్రభావం వల్ల ఈ కార్లన్నింటిలోని ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకున్నాయి. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
రేవంత్ రెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు
మీడియా సిబ్బంది ప్రయాణిస్తున్న కారు అత్యంత దారుణంగా దెబ్బతిన్నది. అందులో ఉన్న వారికి గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో రేవంత్ రెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇతర సభ్యులకు గాయాల స్థాయి కూడా తక్కువగా ఉందని, కాబట్టి ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన పనిలేదని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. శ్రీపాద ప్రాజెక్టు వద్దకు పాదయాత్ర చేపట్టిన సమయంలో ఈ ప్రామాదం జరిగినట్లు నాయకులు వెల్లడించారు.