తదుపరి వార్తా కథనం
Duduma: ప్రమాదస్థాయికి 'డుడుమ'
వ్రాసిన వారు
Sirish Praharaju
Jul 02, 2025
07:03 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులోని డుడుమ జలాశయం (డిడ్యాం) వద్ద నీటిమట్టాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. సాధారణంగా ఈ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 2,590 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 2,588.3 అడుగులకు చేరుకుంది. ఈ పరిస్థితిలో, అధికారులు ఏడో నంబరు గేటు ద్వారా వేల క్యూసెక్కుల వరదనీటిని దిగువన ఉన్న బలిమెల జలాశయానికి విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం కొనసాగితే మరిన్ని గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.