LOADING...
Nagarjuna sagar: నాగార్జునసాగర్‌ కి భారీగా వరద ప్రవాహం.. 26 గేట్లు ఎత్తి నీటి విడుదల
నాగార్జునసాగర్‌ కి భారీగా వరద ప్రవాహం.. 26 గేట్లు ఎత్తి నీటి విడుదల

Nagarjuna sagar: నాగార్జునసాగర్‌ కి భారీగా వరద ప్రవాహం.. 26 గేట్లు ఎత్తి నీటి విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2025
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

నాగార్జునసాగర్‌ జలాశయానికి భారీ స్థాయిలో వరద నీరు చేరుతోంది.దీంతో అధికారులు 26 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో 3,92,997 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 4,73,053 క్యూసెక్కులకు పెరిగింది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 583 అడుగులుగా నమోదైంది. అలాగే ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 291.66 టీఎంసీల నీరు నిల్వగా ఉంది.

వివరాలు 

శ్రీశైలం జలాశయం వద్ద వరద పరిస్థితి 

శ్రీశైలం జలాశయానికి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుండి చేరుతున్న నీటి కారణంగా ఇన్‌ఫ్లో 4,98,022 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం నుంచి 5,13,540 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ ద్వారా 30,000 క్యూసెక్కులు,ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కులు, కుడి గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 29,595 క్యూసెక్కులు వదులుతున్నారు. అదనంగా, 10 స్పిల్‌వే గేట్లను 18 అడుగుల మేర ఎత్తి 4,18,630 క్యూసెక్కులను నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా,ప్రస్తుతం 881.60 అడుగులకు చేరింది. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 197.01 టీఎంసీలు నిల్వగా ఉన్నాయి.