Andhra Pradesh Flood: ఏజెన్సీ ప్రాంతాలలో పెరుగుతున్న గోదావరి ఉదృతి..అప్రమత్తమైన అధికారులు
కృష్ణానది, బుడమేరు వాగు ఉగ్రరూపంతో ఇప్పటి వరకు చూసిన వాటిలో అత్యంత తీవ్రమైన వరద ఈ విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. ప్రతి చోటా వరదనీరు పొంగి జనజీవనాన్ని కష్టంగా మార్చింది.ఈ వరదకు 20 మంది ప్రాణాలు పోయినట్లు తెలుస్తోంది, కానీ ఇప్పుడు ఈ విపత్తు కొంతమేరకు శాంతి చెందుతోంది. అయితే, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వాగుల నుండి వస్తున్న వరద నీరు గోదావరిలో భారీ స్థాయిలో పెరుగుతోంది. భద్రాచలం వద్ద రాత్రి 41అడుగుల నీటిమట్టం చేరింది,ఇది ఆందోళన కలిగించే అంశంగా ఉంది. తదుపరి 24 గంటల్లో ఈ వరద ఉద్ధృతి పెరగవచ్చని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో, తెలంగాణలో భద్రాచలం,ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో పొంగుతున్న వాగులు
ప్రస్తుతం భద్రాచలం వద్ద వరద స్థాయిలు పెరుగుతున్నాయి, ఇది గోదావరికి చేరుకునే వరద ప్రవాహాన్ని పెంచుతోంది. ధవళేశ్వరం వద్ద కూడా వరద ఒరవడి పెరుగుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగుతున్నాయి. రాకపోకలకు ఏవీ సమస్యలు రాకపోయినా, మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిస్తే, వాగులు మళ్లీ పొంగి గోదావరికి వరదలు పోటెత్తే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావం వల్ల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం నుండి వాతావరణం కొంత రిలీఫ్ అందించింది. అయితే, ఆ వర్షాలతో కొన్ని లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురైనాయి.
రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అప్రమత్తం
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో, తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం,కాకినాడ జిల్లాలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ఇబ్బందులకు గురయ్యాయి. గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతున్నందున, రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అప్రమత్తమై, అత్యవసర సమావేశాలు నిర్వహించారు. భారీ వర్షాలు,ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరదలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. గత ఏడాది గోదావరికి మూడు సార్లు వరదలు పొట్టెతాయి, ఈ ఏడాది కూడా వరదలు మరింతగా రావచ్చని నిపుణులు అంటున్నారు.