Heavy rain: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ అండమాన్ సమీపంలో గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో, ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది.
ఇది తదుపరి రెండు రోజుల్లో వాయుగుండంగా మారవచ్చని అంచనా వేస్తున్నారు.
దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మంగళ, బుధవారాల్లో అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
వివరాలు
అల్పపీడనం తుపానుగా మారడానికి అనుకూల పరిస్థితులు
వాతావరణ నిపుణుల ప్రకారం, ఈ అల్పపీడనం తుపానుగా మారడానికి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అయితే, తుపాను తీవ్రత తగ్గి, 27వ తేదీ నాటికి ఇది తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ ప్రజలను అప్రమత్తంగా ఉండమని సూచించారు.
వరిలోపాలు, ఇతర వ్యవసాయ పనులు చేపడుతున్న రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.