LOADING...
Delhi Rain: ఢిల్లీలో భారీ వర్షం.. ఆ రాష్ట్రాలకు ఐఎండీ రెయిన్ అలర్ట్
ఢిల్లీలో భారీ వర్షం.. ఆ రాష్ట్రాలకు ఐఎండీ రెయిన్ అలర్ట్

Delhi Rain: ఢిల్లీలో భారీ వర్షం.. ఆ రాష్ట్రాలకు ఐఎండీ రెయిన్ అలర్ట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 04, 2026
09:11 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని రోజులుగా తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు భారీ వర్షాలు ఊరటనిచ్చాయి. వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గి, చల్లని వాతావరణం నెలకొనడంతో ఢిల్లీ వాసులు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలు ఆస్వాదిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి వర్షాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. మండుటెండల మధ్య కురిసిన ఈ భారీ వర్షాలు చల్లని గాలులతో కలిసి ప్రజలకు సేదతీరే అనుభూతిని కలిగిస్తున్నాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంతో పాటు నోయిడాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నోయిడాలో వడగళ్ల వాన కురవడం ప్రత్యేకంగా ఆకర్షించింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వివరాలు

మొత్తం 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఇదిలా ఉండగా, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక హెచ్చరిక జారీ చేసింది. శనివారం ఢిల్లీతో పాటు మొత్తం 9 రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో తుఫానుల ప్రభావం కూడా ఉండవచ్చని హెచ్చరించింది. ఏప్రిల్ 4, 5 తేదీల్లో బలమైన గాలులు, వర్షం, వడగళ్ల వాన కురిసే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర అవసరాలు తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అలాగే ఏప్రిల్ 7 నాటికి ఉత్తర భారతదేశంలోకి కొత్త పశ్చిమ అవాంతరం (వెస్ట్రన్ డిస్టర్బెన్స్) ఏర్పడే అవకాశముందని వెల్లడించింది.

వివరాలు

వర్షపాతం మరింత పెరిగే అవకాశం

దీని ప్రభావంతో వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఈ పరిస్థితుల్లో రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇక ఉత్తర ప్రదేశ్‌లో కూడా వాతావరణ మార్పులు కనిపించనున్నాయి. రాబోయే 24 గంటల్లో అక్కడ బలమైన ఉరుములు, వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్ర రాజధాని లక్నోతో పాటు పరిసర ప్రాంతాల్లో వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమయంలో గంటకు 50 నుంచి 60కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Advertisement