
Delhi: దిల్లీకి భారీ వర్షం.. ఉరుములతో కూడిన తుఫాన్ హెచ్చరిక!
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో వాతావరణ పరిస్థితులు మళ్లీ తీవ్రతరంగా మారాయి. కేంద్ర వాతావరణ శాఖ శనివారం కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశముందని హెచ్చరిక జారీ చేసింది.
శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం, దుమ్ము తుఫాన్ కలసి నగరాన్ని అతలాకుతలం చేశాయి.
వాతావరణ శాఖ ప్రకారం, ఇది గత 124 సంవత్సరాల్లో ఢిల్లీలో మే నెలలో కురిసిన అత్యంత భారీ వర్షమని పేర్కొంది.
గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. శుక్రవారం కురిసిన వర్షానికి పెద్దపెద్ద వృక్షాలు నేలకొరిగాయి...
Details
ఆరుగురు మృతి
ఈ ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, వారిలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. రహదారులు దెబ్బతిని వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వందలాది వాహనాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, విమాన సర్వీసులు కూడా తీవ్రమైన అంతరాయానికి గురయ్యాయి. దాదాపు 500 విమానాలు ఆలస్యంగా నడిచాయి.
వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, శుక్రవారం 24 గంటల్లో ఢిల్లీలో 77 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇది 1901 తర్వాత మే నెలలో రెండో అత్యధిక వర్షపాతం కాగా, గతంలో 2021 మే 20న నమోదైన 119.3 మి.మీ వర్షపాతం ఇప్పటివరకు రికార్డుగా ఉంది.