LOADING...
Godavari Flood: భారీ వర్షాలకు ఉగ్రరూపం దాల్చిన గోదావరి..! 
భారీ వర్షాలకు ఉగ్రరూపం దాల్చిన గోదావరి..!

Godavari Flood: భారీ వర్షాలకు ఉగ్రరూపం దాల్చిన గోదావరి..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2025
08:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆల్పపీడన ప్రభావంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో విస్తృత వర్షాలు కురుస్తుండటంతో,గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద అధికారులు ఇప్పటివరకు లక్షా 51 వేల క్యూసెక్కుల మిగులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 8.90 అడుగులు గా నమోదైంది.వ్యవసాయ అవసరాల నిమిత్తం అధికారులు బ్యారేజ్ నుండి సాగునీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో తూర్పు డెల్టాకు 3800 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 2100 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 4700 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. గోదావరి ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో ధవళేశ్వరం వద్ద వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశముందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

వివరాలు 

పూర్తిస్థాయి నీటిమట్టాన్ని చేరుకున్న శ్రీశైలం,నాగార్జునసాగర్

ఇక గత నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న మోస్తరు నుంచి భారీ వర్షాల ప్రభావంతో ప్రధాన నదులు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టాన్ని చేరుకున్నట్లు సమాచారం. నదీ తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.