
Heavy Rains: నేడు భారీ.. రేపు అతి భారీ వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ వ్యాప్తంగా వచ్చే రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా సోమవారం నాడు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు తోడైన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో చెదురుమదురుగా భారీ వానలు కురవనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. మంగళవారం నాటికి పలు జిల్లాల్లో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాల వరకు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.
వివరాలు
జూలై 12వ తేదీ వరకు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు
ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురవొచ్చని పేర్కొంది. ఈ కారణంగా ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక పెద్దపల్లి, భూపాలపల్లి, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలన్నింటికీ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే జూలై 12వ తేదీ వరకు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు నుంచి మోస్తరు వర్షాల వరకు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.