తదుపరి వార్తా కథనం
Effect of rains: భారీ వర్షాలు.. ఒకే జిల్లాలో ఐదుగురు మృత్యువాత
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 01, 2024
05:28 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు, ఒకరు విద్యుత్ షాక్‌తో మృతి చెందారు.
మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, ఇద్దరు గల్లంతు అయ్యారు. మహబూబాబాద్ జిల్లాలో కారు కొట్టుకుపోయి డాక్టర్ అశ్విని మృతి చెందారు.
ఇక వెంకటాపురంలో చేపల వేటకు వెళ్లిన నర్సయ్య గల్లంతు అయ్యారు.
వరంగల్ జిల్లా గిర్నిబావిలో చిక్కుకొని వజ్రమ్మ, మల్కాజిగిరి జిల్లా కాల్వపల్లి వాగులో పడి మల్లికార్జున మృతి చెందారు. ఇక హన్మకొండ జిల్లా, పరకాలలో విద్యుదాఘాతంతో యాదగిరి మృతి చెందారు.