NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ap -Telangana Rains : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
    తదుపరి వార్తా కథనం
    Ap -Telangana Rains : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
    బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

    Ap -Telangana Rains : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 30, 2024
    06:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రమైన అల్పపీడనం ఏర్పడింది.శనివారం నాటికి ఇది వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

    ఈ పరిణామంతో,దక్షిణ ఒడిశా,తెలుగు రాష్ట్రాల్లో,కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు,కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది.

    దక్షిణ కోస్తా,రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. సముద్ర తీరంలో బలమైన గాలులు వీస్తుండడంతో, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

    శుక్ర,శని,ఆదివారం రోజుల్లో ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.

    దక్షిణ కోస్తాలో కూడా భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడవచ్చని అంచనా.

    వివరాలు 

    తెలంగాణలో రాబోయే 3 రోజులు 

    ఆదివారం వరకు సముద్రం అలజడిగా ఉండి, గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వివరించారు.

    సెప్టెంబర్ నెలలో ఒకటి లేదా రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉన్నందున, వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

    తెలంగాణలో అల్పపీడన ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

    సెప్టెంబర్ 3 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్,మంచిర్యాల,జగిత్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

    వివరాలు 

    40 - 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు

    అదేవిధంగా, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.

    వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, గంటకు 40 - 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారీ వర్షాలు

    తాజా

    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం

    భారీ వర్షాలు

    తెలంగాణలో 5 రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ తెలంగాణ
    ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న వర్షం.. 24 గంటల్లో 19 మంది మృతి ఉత్తర్‌ప్రదేశ్
    రానున్న 3 రోజుల్లో ఏపీలో జోరుగా వర్షాలు.. బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఆంధ్రప్రదేశ్
    Libya floods: శవాల దిబ్బగా లిబియాలో డెర్నా నగరం.. 'డేనియల్' తుపాను ధాటికి 5,300పైగా మృతి  లిబియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025