LOADING...
Delhi: దిల్లీని ముంచెత్తిన వర్షాలు, స్తంభించిన జనజీవనం
ఢిల్లీలో భారీ వర్షం

Delhi: దిల్లీని ముంచెత్తిన వర్షాలు, స్తంభించిన జనజీవనం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 08, 2023
07:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. శనివారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జల దిగ్భంధంలో మునిగిపోయాయి. అయితే అదివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు. ఈ సీజన్లో దిల్లీలో పడిన తొలి భారీ వర్షం ఇదేనని అధికారులు ధ్రువీకరించారు. 111.4 మి.మీల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అండర్ పాస్‌ల్లోకి నీరు చేరడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇండియాగేట్‌, ప్రగతి మైదాన్‌, నోయిడా మార్గంలో భారీ ట్రాఫిక్‌ జామ్‌తో వాహనదారులు ఇక్కట్లకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భారీ వర్షానికి జలమయమైన రోడ్లు