Heavy Rain:హైదరాబాద్ లో భారీ వర్షం .. అరగంటలో 5 సెంటిమీటర్ల వాన
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. నేటి మధ్యాహ్నం వరకు హైదరాబాద్ లో ఉక్కపోతతతో అల్లాడిన ప్రజలకు ఒక్కసారిగా వచ్చిన వానతో వాతావరణం చల్లబడింది. అరగంటలో అత్యధికంగా 5 సెంటిమీటర్ల వాన కురవడంతో నగరవాసులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. గచ్చిబౌలి, కూకట్‌పల్లి,నిజాంపేట్,బాచుపల్లి,బోయిన్ పల్లి,మారేడుపల్లి, బేగంపేట, చిలకలగూడ, అల్వాల్, మల్కాజిగిరి ఆవు పంజాగుట్ట, బోరబండ, రెహమత్‌నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. మరోవైపు.. రెండు గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో తప్పనిసరైతే తప్ప బయటికి వెళ్లకుండా ఇళ్లలోనే ఉండాలని జీహెచ్ఎంసీ పౌరులకు సూచించారు.