
Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుంచి భారీవర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పిడుగులు నమోదయ్యే అవకాశంతోపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వివరించారు.
Details
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపారు. మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొనడంతోపాటు, పిడుగులు పడే పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు. ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.