Telangana: తెలంగాణలో భారీ వర్షాలు.. 9 మంది మృతి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 01, 2024
06:05 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రంలో 9 మంది మృతి చెందినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. భారీ వర్షాలకు మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఖమ్మంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు ఆపార్ట్‌మెంట్‌లలోని సెల్లార్లు వరద నీటితో మునిగిపోయాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తుండటంతో భారీగా ట్రాఫిక్ స్తంభించపోయింది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.