
Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ రాష్ట్రానికి నిలిచిపోయిన రాకపోకలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ప్రస్తుతం విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
చెరువులు, కుంటలు వరదలతో పోటెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఈ పరిస్థితుల్లో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
ములుగు జిల్లా వాజేడు మండలంలోని టేకులగూడెం గ్రామం వద్ద హైదరాబాద్ నుంచి భూపాలపట్నం వరకు 163 జాతీయ రహదారిపై గోదావరి వరద నీరు చేరడం వల్ల రాకపోకలను నిలిపివేశారు.
Details
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు బయటకి రావాలని అధికారులు సూచించారు.
లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
అవసరమైనప్పుడు అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని కోరారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తగా ఉండాలన్నారు.