LOADING...
రానున్న 3 రోజుల్లో ఏపీలో జోరుగా వర్షాలు.. బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం
రానున్న 3 రోజుల్లో ఏపీలో జోరుగా వర్షాలు.. బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం

రానున్న 3 రోజుల్లో ఏపీలో జోరుగా వర్షాలు.. బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 12, 2023
11:14 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న 3 రోజులలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు భారత వాతావరణ కేంద్ర ప్రకటించింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఈ కారణంగా కోస్తాంధ్రలో వర్షాలు భారీగా కురుస్తాయని పేర్కొంది. మిగతా ప్రాంతాల్లో మోస్తరుగా వానలు పడనున్నట్లు వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీంతో వచ్చే రెండు రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వివరించింది. విజయనగరం, కోనసీమ, శ్రీకాకుళం, మన్యం, పశ్చిమగోదావరి, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో సోమవారం వానలు జోరుగా కురిశాయి. ఈనెల 14 వరకు దేశవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వానలు పడనున్నాయి. ఈశాన్య భారత్ లో వచ్చే 3 రోజుల్లో వర్షాలు కురవనున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం