ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ కొండచరియలు; చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో జన జీవనం స్తంభించిపోయింది.
భారీ వర్షాలకు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లిన పర్యాటకులు అనేక మంది అక్కడే చిక్కుకుపోయారు. అందులో మన తెలుగు వారు కూడా ఉన్నారు.
ఇదే సమయంలో కొండచరియలు విరిగిపడటంతో రవాణా ఎక్కడిక్కడే ఆగిపోయింది.
ముఖ్యంగా రుషికేశ్‌కు దాదాపు 40కి.మీ దూరంలో అనేక యాత్రికులు కొండచరియలు విరిగిపడటం వల్ల రోడ్లపైనే దాదాపు 20గంటలుగా పడిగాపులు కాస్తున్నారు.
విరిగి పడిన కొండచరియవల్ల 20వేల ప్రయాణికులు, దాదాపు 15వందల వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఇక్కడ ఆగిపోయిన వారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు బెంగళూరు నుంచి వెళ్లిన తెలుగు వారు ఉన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విరిగిపడుతున్న కొండచరియలు
Landslide took place at Karnprayag in Chamoli. #LANDSLIDE #Uttarakhand #Chamoli #Mountain #pahad pic.twitter.com/2fRy5mjTHO
— anuj kumar singh (@sanuj42) August 7, 2023