
Heeralal Samaria : సీఐసీగా హీరాలాల్ సమారియా ప్రమాణ స్వీకారం.. ఈ పదవి చేపట్టిన తొలి దళిత వ్యక్తిగా రికార్డ్
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (CIC)గా హీరాలాల్ సమరియా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.
భారత సీఐసీగా బాధ్యతలు చేపట్టిన తొలి దళిత వ్యక్తిగా హీరాలాల్ సమారియా నిలిచారు.ప్రస్తుతం సమాచార కమిషనర్‌గా విధుల్లో ఉన్న హీరాలాల్ ను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం సీఐసీగా ఎంపిక చేసింది.
సెలక్షన్ కమిటీలోని లోక్‌సభ ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సమావేశానికి గైర్హాజరయ్యారు. ఆహ్వానం అందినా పశ్చిమ బెంగాల్‌లో బీజీ కారణంగా రాలేకపోతున్నట్లు తెలిపారు.రాజస్థాన్‌కు చెందిన హీరాలాల్ కార్మిక, ఉపాధి కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సీఐసీగా ప్రమాణ స్వీకారం చేసిన హీరాలాల్ సమరియా
#WATCH | President Droupadi Murmu administers the Oath of Office to Heeralal Samariya, the Chief Information Commissioner at Rashtrapati Bhavan. pic.twitter.com/tPaDthy1qn
— ANI (@ANI) November 6, 2023