Page Loader
G-20 సమావేశం: భారత ప్రతిపాదిత శిలాజ ఇంధన విధానాన్ని వ్యతిరేకిస్తున్న చైనా, సౌదీ
పర్యావరణ మార్పుల చర్చలను వ్యతిరేకిస్తున్న చైనా, సౌదీ

G-20 సమావేశం: భారత ప్రతిపాదిత శిలాజ ఇంధన విధానాన్ని వ్యతిరేకిస్తున్న చైనా, సౌదీ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 08, 2023
05:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

G-20 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా భారతదేశం ప్రతిపాదించిన శిలాజ ఇంధన పద్ధతిని చైనా, సౌదీ వ్యతిరేకిస్తున్నాయి. ఈ మేరకు కఠిన వైఖరి అవలింభించనున్నాయి. గత జులైలో జరిగిన G-20 ఇంధన మంత్రుల సమావేశంలో కార్బన్ క్యాప్చర్ యుటిలైజేషన్ స్టోరేజీ(CCUS)తో సహా అభివృద్ధి చెందిన క్లీన్ ఎనర్జీ టెక్నాలజీలను ప్రోత్సహించడాన్ని ఆమోదించారు. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సమయంలో ఉత్పత్తి చేయబడిన కార్బన్‌ను సంగ్రహించేందుకు CCUS ఉపయోగించవచ్చు. కానీ ఇది చాలా ఖరీదైన ప్రక్రియగా తేలింది. శిలాజ ఇంధన వినియోగాన్ని దశల వారీగా తగ్గించడం,పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను పెంచడం,గ్రీన్‌హౌస్, ఉద్గారాలను తగ్గించడం వంటి అంశాలపై అడ్డంకులు ఏర్పడే ముప్పు ఉంది. ఈ క్రమంలోనే చైనా, సౌదీలు శిలాజ ఇంధనాల తొలగింపుపై ఆందోళన వ్యక్తం చేశాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శిలాజ ఇంధన విధానంపై కఠిన వైఖరి అవలింభించనున్న చైనా, సౌదీ