
Bangladesh: బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పాక్ ఐఎస్‌ఐ కదలికలు.. అప్రమత్తమైన నిఘా వర్గాలు
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
ఈ పరిణామాల మధ్య బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో అసాధారణ చలనం కనిపిస్తోంది.
ఇటీవల మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత ఢాకా,ఇస్లామాబాద్‌ల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయి.
ఈ పరిణామం వల్ల పాకిస్తాన్ నిఘా సంస్థ అయిన ఐఎస్‌ఐతో పాటు ఆ దేశ మిలిటరీ అధికారులు కూడా బంగ్లాదేశ్‌లోని భారత సరిహద్దు ప్రాంతాలకు తరచుగా రావడం ప్రారంభించారు.
ఇక పాకిస్తాన్,బంగ్లాదేశ్‌లో ఉన్న రెడికల్ గుంపులతో సంబంధాలు పెంచుకుంటోంది.
ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు పాక్ తమ స్వలాభాల కోసం బంగ్లా-భారత్ మధ్య ఉగ్ర భావజాల గుంపులను వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నాయి.
vivaralu
పాక్ ఐఎస్‌పీఆర్ ఖాతాలపై భారత్ చర్య
ఈ నేపథ్యంలో భారత భద్రతా ఏజెన్సీలు బంగ్లాదేశ్‌తో సరహద్దు కలిగిన ముర్షిదాబాద్ వంటి కీలక ప్రాంతాల్లోని తమ సరిహద్దు భద్రతా పోస్టులపై మరింత దృష్టి సారించాయి.
పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఐఎస్‌పీఆర్ (ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్) ఆధ్వర్యంలో నడుస్తున్న సామాజిక మాధ్యమ ఖాతాలను భారత్ లో నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం అడిగింది.
ఇందులో యూట్యూబ్ కూడా ఉంది. సోమవారం నాడు భారత్ 16 యూట్యూబ్ ఛానల్స్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను అఫిషియల్‌గా నిలిపివేసిన విషయం తెలిసిందే.
ఈ ఖాతాలు తప్పుడు ప్రచారాలను కొనసాగిస్తున్నాయని గుర్తించి, వాటిని అడ్డుకునేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.