NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Vijayawada: విజయవాడ రైల్వే స్టేషన్‌లో హై అలర్ట్‌.. భద్రతా మాక్‌డ్రిల్‌తో అప్రమత్తత!
    తదుపరి వార్తా కథనం
    Vijayawada: విజయవాడ రైల్వే స్టేషన్‌లో హై అలర్ట్‌.. భద్రతా మాక్‌డ్రిల్‌తో అప్రమత్తత!
    విజయవాడ రైల్వే స్టేషన్‌లో హై అలర్ట్‌.. భద్రతా మాక్‌డ్రిల్‌తో అప్రమత్తత!

    Vijayawada: విజయవాడ రైల్వే స్టేషన్‌లో హై అలర్ట్‌.. భద్రతా మాక్‌డ్రిల్‌తో అప్రమత్తత!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 09, 2025
    11:36 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థను మరింత కఠినతరం చేస్తున్నారు.

    ఈ నేపథ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్‌లో గురువారం రాత్రి ప్రత్యేక మాక్‌డ్రిల్ నిర్వహించారు. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఉండేందుకు ఈ డ్రిల్‌ చేపట్టారు.

    జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ జేవీ రమణ, ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ కోట జోజి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ మాక్ డ్రిల్లులో రైల్వే పోలీసులు, డాగ్ స్క్వాడ్‌లతో కూడిన ఐదు ప్రత్యేక బృందాలు పాల్గొన్నాయి.

    ఈ బృందాలు స్టేషన్‌లోని అన్ని ప్లాట్‌ఫాంలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జులు, విశ్రాంతి గదులు, టికెట్ కౌంటర్లు, బుకింగ్ కార్యాలయాలు, పార్శిల్ విభాగాన్ని పూర్తిగా శోధించాయి.

    Details

    అనుమానాస్పద వ్యక్తుల వివరాల సేకరణ

    అలాగే స్టేషన్ వెలుపల జనసాంద్రత ఎక్కువగా ఉండే పూల మార్కెట్‌, డీజిల్ లోకో షెడ్ వంటి ప్రదేశాల్లోనూ తనిఖీలు చేపట్టారు.

    ప్రయాణికుల బ్యాగులు పరిశీలించడంతో పాటు అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తుల వివరాలను కూడా నమోదు చేశారు.

    రైల్వే స్టేషన్‌లో ఉన్న అన్ని సీసీ కెమెరాల పనితీరును సమీక్షించిన అధికారులు, నిరంతర నిఘా కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.

    కెమెరాల ఫుటేజీని సమయానుసారంగా, జాగ్రత్తగా పరిశీలించాలని సిబ్బందికి ఆదేశాలిచ్చారు. ఈ మాక్‌డ్రిల్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది స్పందనపై అవగాహన కల్పించడంతో పాటు ప్రయాణికుల్లో భద్రతపై నమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విజయవాడ వెస్ట్
    రైల్వే స్టేషన్

    తాజా

    Vijayawada: విజయవాడ రైల్వే స్టేషన్‌లో హై అలర్ట్‌.. భద్రతా మాక్‌డ్రిల్‌తో అప్రమత్తత! విజయవాడ వెస్ట్
    Indian Railways: భారత్‌ - పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో.. భారతీయ రైల్వే కీలక నిర్ణయం  ఆపరేషన్‌ సిందూర్‌
    Operation Sindoor: పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ ఏటీఎంలు మూసివేత వార్తలు.. స్పందించిన పీఐబీ  ఆపరేషన్‌ సిందూర్‌
    Manchu Manoj :'అత్తరు సాయిబు'గా మంచు మనోజ్.. సోలో హీరోగా రీఎంట్రీ! మంచు మనోజ్

    విజయవాడ వెస్ట్

    బెజవాడ బెంచ్ సర్కిల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 300 బైకులు దగ్ధం అగ్నిప్రమాదం
    BillBoard: వాహ్ తాజ్‌మహల్ టీ కాదు.. తబలాలో ను ప్రత్యేకత లైఫ్-స్టైల్
    Broken landslides: విజయవాడలో కొండచరియలు విరిగిపడి బాలిక మృతి కొండచరియలు
    Vijayawada: వరదలో చిక్కుకున్న విజయవాడ.. ప్రాంతాల వారీగా హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే..! ఆంధ్రప్రదేశ్

    రైల్వే స్టేషన్

    ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కలకలం.. 4 బోగీలు పూర్తిగా దగ్ధం రైలు ప్రమాదం
    కాషాయ రంగులోకి మారిన వందే భారత్ రైలు.. కారణం ఇదేనా? వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    తిరుపతి యార్డులో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌, రెండు రైళ్లు రీ షెడ్యూల్‌ తిరుమల తిరుపతి
    హైదరాబాద్: తప్పిన రైలు ప్రమాదం.. ఒకే ట్రాక్‌పైకి రెండు ఎంఎంటీఎస్‌లు హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025